అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా

A movie that connects everyoneకృష్ణ వంశీ, మోక్ష లీడ్‌ రోల్స్‌లో నటించిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై హైమావతి, శ్రీరామ్‌ జడపోలు నిర్మించారు. ప్రముఖ ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నేడు (శుక్రవారం) గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
ఈ నేపథ్యంలో హీరో కష్ణ వంశీ మీడియాతో మాట్లాడుతూ, ‘మాది కడప. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ప్యాషన్‌. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక షార్ట్‌ ఫిల్మ్‌లో నటించాను. కోవిడ్‌ సమయంలో సత్యనంద్‌ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. హైదరాబాద్‌ వచ్చి సినిమా ప్రయత్నాలు చేశాను. ఈ క్రమంలో డైరెక్టర్‌ ఆకాష్‌ని కలిశాను. నా ఆడిషన్‌ ఆయనకి నచ్చి ఈ సినిమా చేశాను. ఇది నా అదష్టం. డైరెక్టర్‌ ఆకాష్‌ చాలా అద్భుతమైన కథ చెప్పారు. ఆయన చెప్పినపుడే మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఇందులో నా పాత్ర పేరు సిద్దు. తనది ఇంట్రోవర్ట్‌ క్యారెక్టర్‌. చాలా కాంప్లెక్స్‌ క్యారెక్టర్‌. చాలా సెటిల్‌గా పెర్ఫార్‌ చేసే రోల్‌. అలాగే ఈ కథలో మంచి ఎమోషనల్‌ జర్నీ ఉంది. యూత్‌ 1000% కనెక్ట్‌ అవుతారు. అలాగే ఫ్యామిలీ కూడా కనెక్ట్‌ అవుతుంది. ఇందులో ఫాదర్‌- డాటర్‌ ఎమోషన్‌, మదర్‌- సన్‌ ఎమోషన్‌ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. సముద్రంలో చాలా అలజడులు వుంటాయి. నా పాత్ర కూడా అలాంటిదే. ఇందులో హీరోయిన్‌ పాత్ర పేరు ధరణి. సముద్రం, భూమి ఎలా కలుస్తారనేది చాలా పొయిటిక్‌గా ప్రజెంట్‌ చేశారు’ అని చెప్పారు.