హీరో విశ్వక్ సేన్, దర్శకుడు రవితేజ ముళ్లపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మెకానిక్ రాకీ’. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 2.0 లాంచ్ చేసిన ఈ వేడుకలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిధులు పాల్గొన్నారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ,’సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయిన మళ్లీ సినిమా తీస్తాను. నాకు తెలిసింది ఒకటే సినిమా. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అభిమానులు, ప్రేక్షకులే. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈనెల 21న పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. ఈ పెయిడ్ ప్రీమియర్స్‌కి రండి. నేను చేసిన పది సినిమాల అనుభవంతో చెబుతున్నాను. ఇది చాలా మంచి సినిమా. ఒక ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు. సినిమా చూడండి. మీరు బాగుందని చెప్తే, 22 నుంచి మిగతా ఆడియన్స్ చూస్తారు’ అని అన్నారు.