మోహన్ లాల్ టైటిల్ రోల్‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ ‘బరోజ్ 3డీ’. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మోహన్ లాల్ మీడియాతో ముచ్చటించారు.
– ఇదొక త్రీడీ ఫాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ మలయాళం నుంచి మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని చాలా యూనిక్‌గా సినిమాని రూపొందించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. విజువల్ వండర్‌తో పాటు స్టొరీ టెల్లింగ్‌ని రీడిస్కవర్ చేసేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా ఉంటుంది.
– ‘గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్’ నవల ఆధారంగాలొక ఇమాజనరీ అడ్వంచర్ కథని రూపొందించాం. వాస్కో డి గామాలో దాగి ఉన్న రహస్య నిధిని కాపాడుతూ వచ్చే బరోజ్, ఆ సంపదను దాని నిజమైన వారసుడికి అందించడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్టొరీ టెల్లింగ్ చాలా కొత్త ఉంటుంది. ప్రేక్షకులు ఓపెన్ మైండ్‌తో వచ్చి ఈ ఇమాజినరీ వరల్డ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను.
– ఈ సినిమాకి ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పని చేశారు. హాలీవుడ్ పాపులర్ కంపోజర్ మార్క్ కిల్లియన్ బీజీఎం ఇచ్చారు. 12 ఏళ్ల లిడియన్ నాదస్వరంతో ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేయడం మరో విశేషం. త్రీడీ సినిమా చేయడం అంత ఈజీ కాదు. అన్ని కెమెరాల విజన్ పర్ఫెక్ట్‌గా సింక్ అవ్వాలి. ప్రేక్షకులకు గొప్ప త్రీడీ అనుభూతి ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సంతోష్ శివన్ కెమరా వర్క్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది.
– గత నలభై ఏళ్ళుగా ఇలాంటి సినిమా రాలేదు. దర్శకుడిగా ఇది నాకు కొత్త అనుభూతి. దర్శకుడిగా తొలి సినిమానే త్రీడీలో చేయడం సవాలుగా అనిపించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.