అందర్నీ నవ్వించే సినిమా

A movie that makes everyone laugh

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ లాంటి పెద్ద సంస్థ రిలీజ్‌ చేయబోతోంది. మైక్‌ మూవీస్‌ బ్యానర్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ శిష్యుడు డాక్టర్‌ ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వం వహించారు. అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 29న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సందర్భంగా హీరో సంజరు రావు మీడియాతో ముచ్చటించారు.
‘ఈ కథ మా నాన్న (బ్రహ్మాజీ) ద్వారా నా దగ్గరకు వచ్చింది. డైరెక్టర్‌ నాకు స్టోరీ చెబుతూనే ఆయన తెగ నవ్వుకున్నారు. నాకు కాన్సెప్ట్‌ బాగా నచ్చింది. వెంటనే ఒకే చేశా. నేను డాగ్‌ లవర్‌ కావడంతో షూటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజారు చేశా. కాని క్యారెక్టర్‌ పరంగా చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో ప్రణవి రోల్‌ ఫుల్‌ లెంగ్త్‌లో ఉంటుంది.
చాలా ముఖ్యమైన పాత్ర ఆమెది. అయితే ఇందులో చాలా మంది డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఉంటాయని అనుకుంటున్నారు. అలాంటివేమి ఉండవు. జనరల్‌గా రాత్రి పూట బారు ఫ్రెండ్‌, గర్ల్‌ ఫ్రెండ్‌ మాట్లాడుకునేదే ఉంటుంది. ఈ రియాలిటీకి యంగ్‌ జనరేషన్‌ కనెక్ట్‌ తప్పకుండా కనెక్ట్‌ అవుతుంది. ఈ సినిమాలో బేబీ (కుక్క)దే కీరోల్‌. అదే సినిమాను మొత్తం డిసైడ్‌ చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపూ అందరూ బాగా నవ్వుకుంటారు.
సెట్స్‌లో మా నాన్నను ఓ నటుడిగానే చూస్తా. మా ఇంట్లో ఒక రూల్‌ ఉంది. పని విషయం గడప బయటనే మాట్లాడుకోవాలి. లోపల పని గురించి మాట్లాడితే.. గడప దాటి వెళ్లాల్సిందే. సినిమాలు, పాత్రల విషయంలో మా నాన్న ఇన్‌పుట్స్‌ ఇవ్వరు. నేను వెళ్లి అడిగితే సలహా ఇస్తారు. లీడ్‌ రోల్‌లోనే విభిన్న పాత్రలు చేయాలని ఉంది. ఒక యాక్టర్‌గా ప్రూవ్‌ చేసుకోవాలని ఉంది. శింబు హీరోగా నటిస్తున్న ఓ తమిళ సినిమాలో విలన్‌గా నటిస్తున్నా. హీరోగా రెండు సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా షూట్‌ స్టార్ట్‌ అయింది. ‘ఓ పిట్టకథ’ చిత్రానికి కో డైరెక్టర్‌గా పనిచేసిన సాయికష్ణ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాను.
‘పుష్ప2’ షూటింగ్‌లో నాన్నతో అల్లు అర్జున్‌ ‘మీ అబ్బాయి సినిమా ట్రైలర్‌ అదిరి పోయింది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు. ట్రైలర్‌ మాత్రం చాలా బాగుంది..’ అని అన్నారట. అంతేకాదు కారు ఎక్కే ముందు ఫయాద్‌ ఫజిల్‌కి కూడా ఈ ట్రైలర్‌ను కచ్చితంగా చూడాలని చెప్పారట. నేను నాన్న, బన్నీ స్ఫూర్తితోనే పరిశ్రమలోకి అడుగుపెట్టా.