సమాజం గురించి ఆలోచించేలా చేసే సినిమా

society
about
to think
A movie that makesవరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌, ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ‘గాండీవధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈనెల 25న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ, ‘వెరైటీ సినిమాలు తీసిన ప్రతీసారి కమర్షియల్‌ సినిమాలు తీసుకోవచ్చు కదా? అని చాలా మంది సలహాలు ఇస్తుండేవారు. కానీ కొత్త కథలు చేయడమే నాకు ఇష్టం. సినిమా హిట్టైనా ఫ్లాపైనా నా ప్రయత్నం ఆగదు. ఆడియెన్స్‌ సపోర్ట్‌ ఉంటే ఇంకా ఇలాంటి కొత్త కథలు చేస్తూనే ఉంటాను. సోషల్‌ మెసెజ్‌ ఉన్న సినిమాలు, అలాంటి కథలు అరుదుగా వస్తాయి. ఎప్పుడూ మన కుటుంబం గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు సమాజం గురించి ఆలోచిస్తుంటాం. అలాంటి ఆలోచనల రావాలనే ఈ సినిమాను తీశాం. అవగాహన కల్పించాలనే ఈ చిత్రాన్ని తీశాం. నిన్న రాత్రే ఈ సినిమాను చూశాను. మంచి సినిమా తీశామనే ఫీలింగ్‌ వచ్చింది’ అని తెలిపారు. ‘నేను ఇప్పటి వరకు చాలా జోనర్లు టచ్‌ చేశాయి. చందమామకథలు, గరుడవేగ చాలా ఇష్టం. యాక్షన్‌ సినిమాలు తీసేటప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎమోషన్స్‌, హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీక్వెన్సులతో ఈ సినిమాను తీశాను. గ్లోబల్‌ ఇష్యూ మీద ఈ సినిమాను తెరకెక్కించాను. ఎమోషన్‌ను జోడించి ఎంటర్టైనింగ్‌, యాక్షన్‌ జోనర్‌లో తీశాను. వరుణ్‌ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నా మనసుకు నచ్చిన సినిమా ఇది’ అని దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు అన్నారు. నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘వరుణ్‌ తేజ్‌తో మేం చేసిన ‘తొలి ప్రేమ’ పెద్ద హిట్‌ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
‘వరుణ్‌ తేజ్‌ మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ఉంటారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల మీద వచ్చిన ఈ స్క్రిప్ట్‌ను ఎంచుకున్నారు. ఆయనతో మళ్లీ సినిమా చేయాలని అనుకుంటున్నాను’ అని హీరోయిన్‌ సాక్షి వైద్య అన్నారు.