వరుణ్ తేజ్ నటించిన ఏరియల్ వార్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్’. తాజాగా హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్ర ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్, రామ్‌చరణ్ లాంచ్ చేశారు. ఐఏఎఫ్ అధికారి అయిన అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్)కి గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా పీడకలలు వస్తుంటాయి. కానీ అది అతని వైఖరి, విధానాన్ని మార్చలేదు. అతను మొండి పట్టుదలగలవాడు. రాడార్ ఆఫీసర్ సోనాల్ (మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉన్న అడ్వంచర్ లవర్. మరోవైపు పుల్వామా దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణిస్తారు. ఇంతకుముందు ఓటమిని ఎదుర్కోని భారత వైమానిక దళం శత్రువులపై వైమానిక దాడిని ప్రకటిస్తుంది. టీంకు నాయకత్వం వహిస్తున్న అర్జున్ తన యుద్ధ విమానానికి గ్రెనేడ్ తగలడంతో ప్రమాదంలో పడతాడు. అయితే, అతనికి మార్గనిర్దేశం చేసేందుకు రాడార్ ఆఫీసర్ సోనాల్ వుంటుంది. వరుణ్ తేజ్ అడ్వంచరస్ స్క్వాడ్రన్ లీడర్‌గా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ రెండింటిలోనూ అదరగొట్టారు. యూనిఫాంలో వరుణుడిని చూడటం కన్నుల పండువగా వుంది. మానుషితో కెమిస్ట్రీ బాగా కుదిరింది.
హీరోయిన్ మానుషి చిల్లర్ మాట్లాడుతూ, ‘ఇది చాలా స్పెషల్ మూవీ. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ అద్భుతంగా ఈ సినిమాని తీశారు’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను. తెలుగులో మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సినిమా చేసిన ఘనత వరుణ్ తేజ్‌కి దక్కుతుంది. ఈ ట్రైలర్లో విజువల్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి’ అని నవదీప్ చెప్పారు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ,’వరుణ్ తేజ్‌కి, నిర్మాతలకు కతజ్ఞతలు. వారి వలనే ఈ సినిమా సాధ్యపడింది. ఈ సినిమా సమిష్టి కషి. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. యాక్షన్ డ్రామా ఫన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి’ అని అన్నారు.
తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవ్వబోతుంది. చాలా కొత్తగా, ఎడ్జ్ అఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్‌ని ఎంజారు చేసే చాలా సీన్స్ ఇందులో ఉన్నాయి. మార్చి 1న ఈ సినిమాని చాలా గర్వంగా, గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్స్కి సెల్యూట్ కొడతారు ప్రేక్షకులు. మన జవాన్ల త్యాగాలని గుర్తు చేసుకుంటూ, వారి ధైర్య సాహసాలని మీముందుకు తీసుకురావడాని చేస్తున్న ప్రయత్నం ఈ సినిమా. అందరికీ దేశభక్తి మనసులో ఉంటుంది. ఈ సినిమా చూశాక అది మరింత పెరుగుతుందని నమ్మకంగా చెబుతున్నాం.
– వరుణ్ తేజ్