సకుటుంబంగా చూడాల్సిన సినిమా

A movie to watch as a familyతొలి సినిమా ‘సినిమా బండి’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల తన రెండవ చిత్రం ‘పరదా’తో వస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌తో పాపులరైన రాజ్‌, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్‌ మక్కువతో కలిసి ఆనంద మీడియా బ్యానర్‌ పై విజయ్‌ డొంకడ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, దర్శన రాజేంద్రన్‌, సంగీత ప్రధాన పాత్రలు పోషించారు. బుధవారం హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఈ చిత్ర టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ,’టీజర్‌ ప్లే చేసినప్పుడు నా పదేళ్ళ జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్‌ అయ్యాను. ఈ రోజు ఆనందంతో పాటు ఒక బాధ్యత కనిపిస్తోంది. మిమల్ని అలరించడానికి ఇలాంటి మంచి పాత్రలు మరిన్ని చేయాలనే బాధ్యత పెరిగింది. నేను ఇండిస్టీకి వచ్చి పదేళ్ళు అవుతుంది. ఈ పదేళ్ళలో నా మోస్ట్‌ ఫేవరేట్‌ ఫిలిం ఇదే. అలాగే మోస్ట్‌ ఫేవరేట్‌ క్యారెక్టర్‌ కూడా ఇందులో చేసిన సుబ్బు. అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది’ అని తెలిపారు. ‘దర్శకుడు ప్రవీణ్‌ చాలా హార్ట్‌ఫుల్‌గా ఈ సినిమా తీశారు. ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. ఈ సినిమాలోని మ్యాజిక్‌ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని హీరోయిన్‌ దర్శన రాజేంద్రన్‌ చెప్పారు.
సంగీత మాట్లాడుతూ,’ ఇలాంటి గొప్ప కథని రాసిన డైరెక్టర్‌కి థ్యాంక్స్‌. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘ఈ సినిమాతో కంటెంట్‌ మాట్లాడుతుంది. ఈ సినిమా మలయాళం రైటర్స్‌ని దుల్కర్‌ సల్మాన్‌ తీసుకున్నారు. పాజిటివ్‌ హోప్స్‌ ఉన్నాయి. ఈ సినిమాతో గట్టిగా హిట్‌ కొడతాం’ అని నిర్మాతలు విజరు, శ్రీధర్‌ మక్కువ చెప్పారు. డైరెక్టర్‌ ప్రవీణ్‌ కాండ్రేగుల మాట్లాడుతూ,’ఐడియాలు చాలా ఉంటాయి. కానీ ఒక నిర్మాత డబ్బులు పెడితేనే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఈ సినిమా ఉమెన్‌ ఒరియంటెడ్‌ సినిమాలకి బిగ్‌ ఓపెనింగ్స్‌ ఇస్తుంది. అలాగే ఈ సినిమాకి కమర్షియల్‌గా డబ్బులు వస్తాయి’ అని అన్నారు.