యూనివర్సల్‌ ఎమోషన్‌ ఉన్న సినిమా

A movie with universal emotionసుహాస్‌, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్‌ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా దసరా సందర్భంగా ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్‌ రెడ్డి బండ్ల మీడియాతో మాట్లాడుతూ, ‘ఇప్పటి జనరేషన్‌లో పెళ్లైన కొత్త జంట ఓ పాపనో, బాబునో కనటానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులేంటి? అనే విషయాన్ని మధ్య తరగతి నేపథ్యంలో తీసుకుని సినిమాగా చిత్రీకరించాం. రీసెంట్‌గా ప్రీమియర్‌ షోస్‌ వేసినప్పుడు చూసిన అన్ని వయసుల వారి దగ్గర్నుంచి పాజిటీవ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఓ వ్యక్తి కండోమ్‌ కంపెనీపై కేసు వేస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథకి బేస్‌. పిల్లల గురించి డిస్కర్షన్‌ అనేది యూనివర్సల్‌ ఎమోషన్‌. ఈ పాయింట్‌ దిల్‌రాజుకి నచ్చడంతో గ్రీన్‌ సిగల్‌ వచ్చేసింది. బాలీవుడ్‌లో ఆయుష్మాన్‌ ఖురానా చేసిన ‘విక్కీ డోనర్‌, బదాయి హో’ తరహా లాంటి అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ సినిమా. తెలుగులో ఇలాంటి అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ సినిమాలు రాలేదు. సుహాస్‌ సినిమాలోని తన పాత్రకు నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికంటే చాలా గొప్పగా న్యాయం చేశారు. విజరు బుల్గానిన్‌ తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. కెకె లిరిక్స్‌, సినిమాటోగ్రాఫర్‌ సాయిశ్రీరామ్‌ ఇచ్చిన విజువల్స్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ రామ్‌ కుమార్‌, ఎడిటర్‌ పవన్‌, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ భరత్‌ గాంధీ ఇలా అందరూ ఇచ్చిన సపోర్ట్‌తో మంచి సినిమాను తెరకెక్కిం చాను. పిల్లలు కావాలా..వద్దా అనుకునే పాయింట్‌ చుట్టూ తిరిగే కథ. ఈ మూవీ మగవాళ్లకు ఎంత నచ్చుతుందో, మహిళలకు కూడా అంతే బాగా నచ్చుతుంది’ అని తెలిపారు.