కదిలే కాల చక్రం

A moving cycle of timeనేనే కదిలే కాలచక్రాన్ని
ప్రపంచాన్ని నడిపించే ఒకే ఒక ఆధారాన్ని!
డబ్బు పెట్టి కొనలేని ఖరీదైనా బంగారాన్ని!
వెల కట్టి పొందలేని మెరిసే వజ్రాన్ని!
ఎవరి కంట పడకుండా గాలిలో నిండిపోయిన పరిమళాన్ని!
పట్టుకుందామని చూస్తే జారిపోయే పాదరసాన్ని!
అప్పుడప్పుడు గులకరాళ్ళ మీద నదిలా నడిచే నీటి ప్రవాహాన్ని!
మదిలో కదిలే భావాలకు ప్రతిరూపమై నిలిచే చిత్రాన్ని!
అంచనాలకు అందని ప్రతిబంధకాన్ని!
ఆచరణకు సాధ్యం కానీ అడ్డంకులను తొలగించే ఏకైక మార్గాన్ని!
అనుకున్న లక్ష్యం వైపు నడిపించే
ఒకే ఒక సాధనాన్ని!
ఋతువుల ఆగమనాన్ని నిర్దేశించే కాలాన్ని!
అతీతమైన శక్తులకు అడ్డుగా నిలబడి ఆపే బలాన్ని!
ప్రకతి నియమాలను శాసిస్తూ నడిపించే పంచ భూతలాకు అధిపతిని!
కాలచక్రమై తిరిగే రంగుల రాట్నాన్ని!
మానవ మనుగడకు మార్గం చూపే సమయ సూచికని!
కళ్ళ ముందు కనిపిస్తూ పలకరించే మూడు ముళ్ళ గడియారాన్ని!
తలరాతలను మార్చే కాగితం మీదున్న తేదీల రూపంలోని క్యాలెండర్‌ని!
నిరంతరం కాళ్ళు లేకున్నా కొనసాగే కాలాన్ని!
దారి తప్పి నడిచే ఈ లోకానికి మార్గ
నిర్దేశం చేసి నడిపించే సమయాన్ని!!
– ఎస్‌.జవేరియా
9849931255