మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘ట్రూ లవర్’. ఈ సినిమాను మిలి యన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకువస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ‘ఈ సినిమా కూడా ‘బేబి’ మూవీలా బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నా. మణికందన్ ‘జై భీమ్’లో కీ రోల్ చేశారు. ఆయన పర్‌ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’ అని ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి చెప్పారు. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ, ‘మా సినిమా తమిళంలో ‘లవర్’గా ఇక్కడ ‘ట్రూ లవర్’గా మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా చేస్తూ చేస్తూ మేమూ మూవీతో ప్రేమలో పడ్డాం. తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్ట్ ఉంది. మంచి సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు’ అని తెలిపారు. ‘మేము నిర్మించిన ‘బేబి’ సినిమా చూసినప్పుడు ఎలాంటి ఫీల్ కలిగిందో ..ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అలాంటి ఎగ్జైట్‌మెంట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసి మా ఫ్రెండ్ బన్నీ వాస్ ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పారు. ఆయనకు అంత బాగా నచ్చింది. రెండు రోజుల ముందుగానే అందరి కోసం ఈ సినిమా ప్రీమియర్ షోస్ వేస్తున్నాం. ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమించాలనుకునేవాళ్లు అందరూ ఈ సినిమాను ఇష్టపడతారు’ అని ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ అన్నారు. హీరో మణికందన్ మాట్లాడుతూ, ‘నేను చేసిన ‘గుడ్ నైట్, జైభీమ్’ సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులు తమ ప్రేమను చూపిస్తూ వస్తున్నారు. ఈ సినిమా యూత్‌కు మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా నచ్చేలా ఉంటుంది’ అని చెప్పారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, ‘తన ప్రేయసిని మరొకరు ఎవరైనా ట్రాప్ చేస్తారేమో ప్రతి లవర్ భóయపడతాడు. ఈ విషయంలో అమ్మాయిల తప్పేం లేదు. వాళ్లకు స్నేహాలు ఉండొచ్చు. స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఈ సినిమాలో ఎవరిదో ఒకరిది తప్పని చూపించలేదు. ఒక జంట మధ్య ఏర్పడిన పరిస్థితుల వల్ల ఒక ప్రేమికుడు తన ప్రేమను కాపాడుకునేందుకు ఏం చేశాడు అనేది ఈ సినిమా’ అని అన్నారు.