– టైరు పగిలి మెట్రో పిల్లర్‌ను ఢకొీన్న కారు
నవతెలంగాణ-చైతన్యపురి
తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పల్లె రవికుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం ఖైరతాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని పరామర్శించిన అనంతరం ఆయన ఎల్‌బీనగర్‌లోని ఇంటికి కారులో బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో కొత్తపేట రైతు బజార్ వద్ద కారు టైరు పగిలిపోయి ఊడిపోయింది. దాంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను, మెట్రో పిల్లర్‌ను ఢకొీట్టింది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో రవికుమార్‌కు ఎలాంటి గాయాలూ కాలేదు. డ్రైవర్ ఖదీర్ స్పల్పంగా గాయపడ్డాడు.