
నవతెలంగాణ – కంటేశ్వర్
బీజేపీకేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య కార్పోరేట్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక వర్గం నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బీఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఎల్ఎఫ్ జిల్లా కార్యాలయంలో ఫిబ్రవరి 16 దేశవ్యాప్త సమ్మె కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఓంకార్ భవన్ లో జరిగిన సమావేశంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాలైన AICTU, BLTU,BFTU,TFTU, TBCTC అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య లుజాయింట్ యాక్షన్ కమిటి జేఏసీ గా ఏర్పడి జాతీయ స్థాయిలో జరిగే సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ, అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని కోరారు. ఈకార్యక్రమంలో బీఎల్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ బీఎల్ టీయూ నాయకులు ప్రశాంత్, బి.ప్రసాద్, చిన్న గంగాధర్, అంజయ్య ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.