– సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ
నవతెలంగాణ-పరిగి
16వ తేదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయ వంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి రామ కృష్ణ అన్నారు. శనివారం పరిగి పట్టణ కేంద్రంలో ప్రభు త్వ పాఠశాలలో వంట చేసే మిడ్ డే మీల్స్ కార్మికులు సమ్మె నోటీస్ అందజేశారు. గ్రామపంచాయతీ కార్మికులు పరిగి ఎంపీడీవోకు సమ్మె నోటీస్ అందజేశారు. సీఐటీ యూ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ.. కార్మి కులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గు ర్తించి, 11వ పీఆర్సీ అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పిం చాలన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతి రేకంగా 16న సమ్మెను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం కార్మికులు ఎల్లమ్మ, జంగమ్మ, గౌరమ్మ, నజియా బేగం, గ్రామపంచాయతీ కార్మికులు శ్రీనివాస్, బాబయ్య, శేఖర్, దితరులు పాల్గొన్నారు.