నవతెలంగాణ-ఆర్మూర్: వేల్పూర్ మండలంలోని జానకంపేట గ్రామానికి చెందిన సౌడ నవీన్ హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో అస్సైయోడ్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఆయన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ రవీందర్ పదోన్నతి ఉత్తర్వును నవీన్ కు మంగళవారం అందజేసినారు. 2008 సంవత్సరంలో తెలంగాణ యూనివర్సిటీ లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల్లో చేరారు. 2013లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సికింద్రాబాద్ పీజీ కాలేజీకి బదిలీ అయ్యారు. ఇంగ్లీష్ ఆచార్యుడిగా పనిచేస్తూనే అక్కడ 2015 వరకు యూత్ వెల్పర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించారు. 2018లో ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ఇంగ్లీష్ విభాగానికి హెడ్గా నియమితులయ్యారు. ఓయూలోనే 2020 లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు.. 2021లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు.. ఆయన పదోన్నతి పొందడం పట్ల జానకంపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.