
మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ రాములు మనవడు అక్షయ్ దీపక్ కు యు పి ఎస్ సి సివిల్ సర్వీసులో 196 ఆల్ ఇండియా ర్యాంకును పొందాడు. ఈ సందర్భంగా శుక్రవారం మండల వాసులు హర్షం వ్యక్తం చేసినారు. మండల కేంద్రానికి చెందిన దీపక్ కుమారుడు అక్షయ దీపక్ సివిల్ సర్వీసులో అత్యుత్తమ ర్యాంకును పొందడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.. అక్షయ్ దీపక్ అమ్మ మాధవి, సోదరుడు డాక్టర్ అనురాగ్ దీపక్ కార్డియాలజిస్ట్, వదిన కోనేరు స్నేహ ఇంటర్నల్ మెడిసిన్ అమెరికాలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. అక్షయ్ దీపక్ బీటెక్ ఎంటెక్ లు ఐఐటి ఖారగ్పూర్ లో చేశారని తెలిపారు. అక్షయ దీపక్ సివిల్ లో ఉత్తమ ర్యాంకు పొందినందుకు జెడ్పిటిసి భారతీ రాకేష్ చంద్ర, ఎల్ ఎఫ్ ఎల్ ప్రాధనో ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు జంగం అశోక్, రిటైర్డ్ టీచర్ గంగాధర్ గౌడ్, రిటైర్డ్ టీచర్ సి ప్రకాష్, సయ్యద్ ఇస్మాయిల్, చంద్రశేఖర్ గౌడ్, పి సుధాకర్, పిల్లమారి ప్రమోద్, ఎస్ మనోహర్ తదితరులు అభినందనలు తెలిపారు.