నయా యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌

A new action crime thrillerహాంగ్‌ కాంగ్‌ సినీ చరిత్రలో వెయ్యి కోట్ల రూపాయల్ని వసూలు చేసిన సంచలన చిత్రం ‘హాంగ్‌ కాంగ్‌ వారియర్స్‌’. లూయిస్‌ కూ, సమ్మో కామ్‌-బో హంగ్‌, రిచీ లీడ్‌ రోల్స్‌ నటించిన ఈ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌కి సోరు చీయాంగ్‌ దర్శకత్వం వహించారు. కిన్‌-యీ ఔ, తై-లీ చాన్‌, లి జున్‌ రైటర్స్‌. హాంగ్‌కాంగ్‌లో విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఈనెల 24న తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఎన్‌విఆర్‌ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తోంది. లీడ్‌ యాక్టర్స్‌ ఇంటెన్స్‌ యాక్షన్‌ మోడ్‌లో కనిపించిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ అందరిలోనూ మరింత క్యూరియాసిటినీ రైజ్‌ చేసింది.