ఇప్పుడే పుట్టిన బిడ్డ కు ముర్రు పాలు తాగించాలి..

A new born baby should be given myrrh milk.నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని సుద్ధులం గ్రామంలో అంగనవాడి కేంద్రంలో శుక్రవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంగనవాడి టిచర్లు పాల్గొని మాట్లాడుతూ.. ప్రాదమిక పాఠశాల గర్భవతులు, బాలింతలు, బిడ్డపుట్టిన వెంటనే బిడ్డకు పాలు ఇవ్వాలని, మొదటగా వచ్చే ముర్రు పాలలో వ్యాది నిరోదక శక్తి ఉంటుందని వివరించారు.బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి, బిడ్డకు అనుబందం పేరుగుతుందని,6 నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు.ఇదే కాకుండా బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి రక్తస్రావం తగ్గుతుందని, గర్ఘ సంచి యదస్థితికి వస్తుందని తెలిపారు. రోమ్ము కాన్సర్ రాకుండా ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమం లో గర్భిణీలు, బాలింతలు, తల్లులు, అంగన్వాడీ కార్యకర్తలు,అశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.