నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఉద్యోగాల కోసం పోటీపడుతున్న నిరుద్యోగ యువతకు జ్ఞానోదాయన్ని కల్గించే విజ్ఞాన బండారాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఇందులో భాగంగా ఈ నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయాలం కోసం నూతన భవనం కావాలని మండల పరిధి యువకులు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి పలు మార్లు వినతి పత్రం ఇవ్వడంతో స్పందించిన స్పీకర్ ఎస్డీఫ్ నిధులతో 2023 లో 10 లక్షల రూపాయలతో కొత్త భవనం నిర్మించారు. అక్టోబర్ 2023లో గ్రంథాలయం ను ప్రారంభించారు. అలాగే జిల్లా గ్రంథాలయాలం నుంచి కొంత సామాగ్రి పుస్తకాలు వచ్చిన గత 10 మాసల నుంచి గ్రంథాలయం తలుపులు తీసేవారు లేరు. 10 లక్షల రూపాయలతో గ్రామం మధ్యలో నూతన భవనం నిర్మించినప్పటికీ కనీసం గ్రంథాలయం తలుపులు తెరిచే వారు లేకపోవడంతో మండల స్థాయి యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త భవనం నిర్మించారు కానీ సిబ్బందిని పుస్తకాలను వార్త పత్రికలను గ్రంథాలయంలో లేకపోవడంతో నూతన గ్రంథాలయ భవనం ఉత్సాహ విగ్రహం లాగా కనిపిస్తుందని యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు . జిల్లాలో గ్రంథపాలకులతో పాటు సిబ్బంది కొరత కారణంగా గ్రామీణ గ్రంథాలయాలు మూత పడుతున్నాయి. దీంతో గ్రంథ పఠనానికి అలవాటు పడిన మేధావులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ఇద్దరే గ్రంథపాలకులు..
జిల్లాలో సెంట్రల్ గ్రంథాలయంతో పాటు 18 శాఖ గ్రంథాలయాలు, 7గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. కానీ జిల్లా వ్యాప్తంగా ఇద్దరు గ్రంథపాలకులు మాత్రమే ఉండటంతో వారి పర్యవేక్షణ కరువైంది. చాలా చోట్ల శాఖ గ్రంథాలయాలు రోజుల తరబడి మూసి ఉంటున్నాయి. అలాగే గ్రామీణ గ్రంథాలయాల్లో సిబ్బంది కొరతతో మూత పడుతున్నాయి. బీర్కూర్ మండల గ్రంథాలయం ఒకప్పుడు ఆదర్శం నేడు భవనం శిథిలావస్థం చేరుకోవడంతో విలువైన పుస్తకాలకు చెదలు పడుతున్నాయి. నసురుల్లాబాద్ మండల గ్రంథాలయం మూతపడింది. దీంతో గ్రామంలోని నిరుద్యోగులు పుస్తక పఠనానికి దూరం అయ్యారు. ఇలా జిల్లా వ్యాప్తంగా గ్రంథపాలకులు, పార్ట్ టైం ఉద్యోగులు, వాచ్ మెన్ కొరతో గ్రంథాలయాలు మూతపడుతున్నాయి. గ్రంథాలయంతోపా టు శాఖ గ్రంథాలయాల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబందించిన అన్ని రకాల పోటీ పరీక్షల కోసం యువకులు పుస్తకాలతో పోటీ పడుతున్నారు. పోటీ పరీక్షల కోసం ప్రభుత్వం యువకులకు కావాల్సిన పుస్తకాలు, సిబ్బందిని ఏర్పాటు చెయ్యాలని మండల ప్రజలు కోరుతున్నారు.