వినాయకుల వద్ద కొత్త సంస్తృతి

Adilabad– లక్కీ డ్రాలతో ఆకట్టుకుంటున్న నిర్వాహకులు
– చందాల స్థానంలో లక్కీ డ్రాల నిర్వహణ
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
జిల్లావ్యాప్తంగా వారం రోజుల నుండి ఎక్కడికక్కడ వినాయకుల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో వినాయక మండపాల వద్ద లక్కీ డ్రాలు నిర్వహిస్తూ నిర్వాహకులు వినూత్న సంస్కృతికి శ్రీకారం చుట్టారు.
వినాయకుల వద్ద కోత్త సంస్కృతి
రానురాను పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో వినాయకుల వద్ద కోత్త సంస్కృతి కనబడుతోంది. డెకొరేషన్‌లతో పాటు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒక్కొక్క రకమైన వస్తువులతో ఒక్కోచోట వినాయకులను ఏర్పాటు చేస్తు వినూత్నంగా కొత్తదనం ఉట్టిపడేలా పడేలా నిర్వహణ చేస్తున్నారు. ప్రతిరోజు వినాయకుల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
లక్కీ డ్రాలతో ఆకట్టుకుంటున్న నిర్వాకులు
వినాయక మండపాల నిర్వాహకులు లక్కీ డ్రాలతో భక్తులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ సేవ యువజన సంఘం ఆధ్వర్యంలో బెలోనో కారు లక్కీ డ్రాగా పెట్టగా అనేక చోట్ల అనేక చోట్ల ద్విచక్ర వాహనాలు, బంగారం, రిఫ్రిజిరేటర్లు లక్కీ డ్రాలుగా పెట్టారు.
చందాల స్థానంలో లక్కీ డ్రాలు
గతంలో వినాయక విగ్రహ ఏర్పాటు కోసం కొంత మంది కలిసి చందాలు జమ చేసి మండపం ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రజల నుండి చందాలు జమ చేయకుండా నిర్వాహకులు లక్కీ డ్రా పెట్టి డ్రా కంటే అధికంగా వచ్చిన మొత్తాన్ని నిర్వహణ ఖర్చులుగా వాడుతున్నారు. స్వచ్ఛందంగా ఎవరైనా వినాయకునికి చందా ఇస్తే మాత్రమే తీసుకుంటున్నారు.
నేడు కొన్ని చోట్ల నిమజ్జనాలు
వారం రోజులుగా భక్తుల పూజలు అందుకుంటున్న వినాయకుడికి నేడు నిమజ్జోత్సవాలు నిర్వహించానున్నారు. జిల్లా కేంద్రంలోని పలు వినాయకులతో పాటు కాగజ్‌నగర్‌ పట్టణంలోని వినాయకులు పలు మండలాల్లోని వినాయకుడు నేడు నిమజ్జనం చేయనున్నారు. పోలీసులు ఇతర శాఖల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రజల భాగస్వామ్యం కోసమే
రాపర్తి కార్తిక్‌, సంఘసేవ యువజన సంఘం నిర్వాకుడు
పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు భరించడంతో పాటు ప్రజలను వినాయక వేడుకల్లో భాగస్వాములు చేయడానికి లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నాం. చందాలు అడిగే సంస్కృతి స్వస్తి పలకడంతో పాటు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.