సరికొత్త అనుభూతినిచ్చే బడ్డీ

సరికొత్త అనుభూతినిచ్చే బడ్డీఅల్లు శిరీష్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్‌, ప్రిషా రాజేశ్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్‌ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహించిన ఈ అడ్వెంచరస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ నేడు (శుక్రవారం) గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం హీరో అల్లు శిరీష్‌ మీడియాతో సంభాషించారు.
‘ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్‌ ఉన్నాయి. బడ్డీ ఫేస్‌ను యానిమేట్‌ చేయాలి. వాటిని పర్పెక్ట్‌గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్‌ ఇవ్వాలి. దాంతో లేట్‌ అయ్యింది. సమ్మర్‌ అనుకున్నది ఆగస్టుకు పోస్ట్‌ పోన్‌ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే కీ పాయింట్‌ మీదే సినిమా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌కు తగ్గకుండా సీజీ వచ్చింది. డైరెక్టర్‌ శామ్‌ ఆంటోనీ ఈ కథతో నా దగ్గరకు వచ్చి టెడ్డీ బేర్‌ పాయింట్‌తో ఉంటుందని చెప్పారు. హీరోయిన్‌కు, విలన్‌కు ఉండే కాన్‌ఫ్లిక్ట్‌, హీరో క్యారెక్టరైజేషన్‌, కథకు ఇచ్చిన జస్టిఫికేషన్స్‌ అన్నీ బాగా స్క్రిప్టింగ్‌ చేశాడు. ఈ కథ వింటునప్పుడు కొత్తగా అనిపించింది. నేను ఫస్ట్‌ టైమ్‌ పైలట్‌గా కనిపించబోతున్నా. నా క్యారెక్టర్‌ ఇంటెన్స్‌గా ఉంటుంది. ఈ సినిమా పోస్టర్‌ రిలీజ్‌ నుంచి ఇది రీమేక్‌ కదా అని కామెంట్స్‌ వచ్చాయి. కాదు స్ట్రైట్‌ ఫిల్మ్‌ అని చెప్పడమే మాకు పెద్ద సవాల్‌గా మారింది. అందరికీ అందుబాటు ధరల్లో మా సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నాం. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇకపై కూడా అలాగే చేస్తాను’.