సరికొత్త అనుభూతినిచ్చే సినిమా

A new feeling movieదుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. సోమవారం ఏఎంబీ సినిమాస్‌లో ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ, ”ట్రైలర్‌ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. హాస్యం, భావోద్వేగాలు మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉంటాయి’ అని చెప్పారు. ‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో సుమతి పాత్ర నాకు బాగా ఇష్టమైన పాత్ర. నా మనసుకి బాగా దగ్గరైన చిత్రం’ అని కథానాయిక మీనాక్షి చౌదరి అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ‘సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. బ్యాంకింగ్‌ నేపథ్యంలో కుటుంబం భావోద్వేగాలతో నడిచే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈనెల 31న విడుదల కానుంది.