కేంద్రంలో కొత్త ప్రభుత్వం

– రైతులతో చర్చలకు సమయం ఇవ్వాలి : రాకేష్‌ తికాయత్‌
ముజఫర్‌నగర్‌ : కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా… వారు రైతులతో చర్చలకు సమయం ఇవ్వాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నాయకులు రాకేష్‌ టికాయత్‌ తెలిపారు. ‘దేశంలో సమస్యలు ఉన్నప్పుడు ఆందోళనలు (నిరసనలు) రేగుతాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా వారు చర్చల కోసం సమయం ఇవ్వాలి’ అని ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తికాయత్‌ తెలిపారు. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం)లో బీకేయూ కూడా ఒక భాగం.