ఐటీసీ నుంచి నూతన శ్రేణీ అగరుబత్తి

హైదరాబాద్‌ : ప్రముఖ అగరుబత్తి బ్రాండ్‌లలో ఒక్కటైన ఐటీసీ మంగళ్‌దీప్‌ కొత్తగా మంగళ్‌దీప్‌ ఫ్యూజన్‌ పేరుతో నూతన శ్రేణి అగరుబత్తులను ఆవిష్కరించినట్టు తెలిపింది. ఈ వినూత్న ఉత్పత్తి శ్రేణి భారతీయ గృహాలలో సాంప్రదాయకంగా ఉపయోగించే సహజ పదార్ధాలు సువాసనలను జాగ్రత్తగా ఎంపిక చేసి రూపుదిద్దబడిందని ఆ కంపెనీ ప్రతినిధి గౌరవ్‌ తాయల్‌ పేర్కొన్నారు. ఇవి అరేబియన్‌ సువాసనతో పాటు సాంబ్రాణీ రెసిన్‌ వాసనలను అందించనున్నాయన్నారు.