వర్ల్‌పూల్‌ నుంచి నూతన శ్రేణి రిఫ్రిజిరేటర్లు

న్యూఢిల్లీ: వర్ల్‌పూల్‌ ఇండియా కొత్తగా ఐస్‌ మ్యాజిక్‌ ప్రో గ్లాస్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్‌ శ్రేణిని విడుదల చేసినట్లు వెల్లడించింది. నివాసాల్లో మారుతున్న ఆధునికీకరణకు సమకాలీనంగా ఉండటానికి కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఇది గోల్డ్‌ డస్ట్‌, సిల్వియా, నైట్‌ బ్లూమ్‌లలో లభిస్తుందని పేర్కొంది. విద్యుత్‌ కోతల సమయంలోనూ 12 గంటల పాటు పాలను నిల్వ చేయగల సామర్థ్యం వీటికి ఉందని తెలిపింది. ఇవి 192, 207 లీటర్ల సామర్థ్యాల్లో లభిస్తాయని వెల్లడించింది.