తెలంగాణలో కొత్త పథకం.. వారికి రూ.లక్ష

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌: ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. అంతకుముందు సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరామ్‌ పాల్గొన్నారు.