
మండల కేంద్రమైన కుబీర్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు తహసీల్దార్ భవనం లేకపోవడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవడంతో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆదేశాను సారంగా శనివారం ఆర్ &బి ఈఈ సునీల్ బాబు, బీజేపీ మండల నాయకులు కలసి తహసీల్దార్ భావన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా బీజేపీ మండల అధ్యక్షడు ఏశాల దత్తాత్రి మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి మండల కేంద్రంలో తహసీల్దార్ భవనం లేకపోవడంతో మండల ప్రజలు, అధికారులు ఎన్నో ఇబ్బందులు కావడం జరిగింది. దింతో ఎమ్మాల్యే రామారావు పటేల్ చోరువా చూపి మండలంలో నూతన తహసీల్దార్ భవనాన్ని మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు దింతో నూతన భవనం స్థలం పరిశీలించడం తో మండల వసూలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ సాయినాథ్ రమేష్ గంగా శేఖర్ మండల ప్రజలు తదితరులు ఉన్నారు.