
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ఉప్లూర్ లో ఓం శ్రీ మొదటి పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు సంఘ భవనంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా జిందం గంగాధర్, ఉపాధ్యక్షులుగా ద్యావరశెట్టి తిరుపతి, కార్యదర్శిగా పెంబర్తి నరేష్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా జిందం రమేష్, ద్యావరశెట్టి హన్మాండ్లు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సంఘ సభ్యులు అభినందించారు. అంతకుముందు సంఘ భవనంలో పద్మశాలీల కులదైవమైన మార్కండేయ పూజను ఘనంగా నిర్వహించి, సభ్యులు ఉగాది పచ్చడిని స్వీకరించారు. 2023-24 సంవత్సరానికి గాను సంఘ జమ ఖర్చులను పరిశీలించారు. కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యెనుగందుల శశిధర్, మండల పద్మశాలి సంఘం సభ్యులు జిందం శ్రీనివాస్, నాగుల ప్రసాద్, అంగరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.