అశ్వారావుపేటలో ఒక నామినేషన్ దాఖలు…

నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజక వర్గానికి నామినేషన్ లు స్వీకరణ రెండో రోజు శనివారం ఒక నామినేషన్ దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి,అదనపు కలెక్టర్ డా.పి.రాంబాబు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్ధి గా మెచ్చా నాగేశ్వరరావు ను దొడ్డ శ్రీరామమూర్తి బలపరిచిన ఆయన నామినేషన్ పత్రాన్ని మెచ్చా నాగేశ్వరరావు తరుపున ఆయన సమీప బంధువు మెచ్చా రాము అందజేసినట్లు తెలిపారు.దీంతో మెచ్చా నాగేశ్వరరావు నామినేషన్ ఈ నియోజక వర్గంలో మొదటి నామినేషన్ గా నమోదు అయింది.