రోగులకు సాంత్వన కలిగించేలా పాలియేటివ్ కేర్ సెంటర్ కృషి

A palliative care center strives to provide comfort to patientsనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతూ చివరి దశలో ఉన్న వారికి సాంత్వన కలిగించేలా హస్పైస్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్ ఎంతో ఉపయుక్తమైన సేవలు అందిస్తోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. కృష్ణ తెలిపారు. శనివారం హాస్పైస్ అండ్ పాలియేటివ్ కేర్ డేను పురస్కరించుకుని రిమ్స్ లోని పాలియేటివ్ సెంటర్లో చికిత్స పొందుతున్న రోగులకు రిమ్స్ డైరెక్టర్ డా. జైసింగ్ రాథోడ్ తో కలిసి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డా.కృష్ణ మాట్లాడుతూ.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి చికిత్స పొంది మరణశయ్యపై ఉండే రోగులకు సాంత్వన కలిగించేలా రిమ్స్ లోని హస్పైస్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్ కృషి చేస్తోందని తెలిపారు. 620 మంది బాధితులు ఈ సెంటర్ ద్వారా సేవలు పొందుతున్నారని, దీనికి తోడు ముబైల్ యూనిట్ కూడా పనిచేస్తోందన్నారు. వీరిలో అత్యధికంగా 196 మంది ఓరల్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిపారు. బాధను భరించలేని చివరి దశలో ఉన్న బాధితులకు ఈ కేంద్రం సాంత్వన కలిగిస్తోందన్నారు. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న బాధితుల సౌకర్యార్థం ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పైస్ అండ్ పాలియేటివ్ సెంటర్ను 2018లో ప్రారంభించడం జరిగిందని డైరెక్టర్ తో తెలిపారు. అంకాలజి విభాగ వైద్యుడు డా. జక్కుల శ్రీకాంత్ రోగులను నిత్యం పరిశీలిస్తూ అవసరమైన చికిత్సలు అందిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డీఎంహెచ్ఓ డా. సాధన, ఎన్.సి.డి కార్యక్రమ అధికారి డా. శ్రీధర్, ఎన్.ఎస్.ఎం ప్రోగ్రాం అధికారి డా.వంశీకృష్ణ, పాలియేటివ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డా.వెంకటేశ్, ఫిజియోథెరపిస్ట్ సునీత పాల్గొన్నారు.