కంచు కోటలో.. పట్టు కోల్పోతున్న పార్టీ

– స్థానిక ఎన్నికల్లో ప్రభావం పై చర్చ
– కారు దిగడానికి సిద్ధమవుతున్న క్యాడర్
నవతెలంగాణ – సిరిసిల్ల
కరీంనగర్ పార్లమెంటు లో బీఆర్ఎస్ పార్టీ నిలవడంతో ఆ పార్టీ అంతర్మాతనంలో పడింది లోక్సభ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించి గెలుపు ధీమాతో కనిపించిన బి ఆర్ ఎస్ కు భారీ షాక్ తగిలింది. కరీంనగర్ బీ.ఆర్.ఎస్ ముందు నుంచి ఆశ పెట్టుకున్నా ఫలితాలు మాత్రం భిన్నంగా రావడంతో నేతలు సమాలోచనలు చేస్తున్నారు. బిఆర్ఎస్ కంచుకోటగా భావించే కరీంనగర్ జిల్లాలో అనూహ్యంగా కమలం జెండా ఎగరడంతో బీఆర్ఎస్ నేతలకు పెద్ద షాక్ తగిలింది.
కరీంనగర్ పార్లమెంటు లో బీఆర్ఎస్ మూడో స్థానం
ఒకనాటి కంచు కోటను కారు పార్టీ కోల్పోయేస్థితికి చేరుతుంది. ద్వితీయ శ్రేణి క్యాడర్ సైతం కారు దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ కు కంచుకోట ఉమ్మడి కరీంనగర్ జిల్లా. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో కారు సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా గులాబీ బాస్ కు అండగా నిలిచారు కరీంనగర్ ప్రజలు. కరీంనగర్ కు టిఆర్ఎస్ కు మధ్య సెంటిమెంటు సంబంధం ఉండేది. ఇక్కడ నెగ్గితే చాలు తెలంగాణ అంతట పాజిటివ్ ఫలితాలు వస్తాయని ఇది పార్టీ పెద్దల నమ్మకం. కానీ ఇప్పుడున్న పరిస్థితి మారిపోయింది. కంచు కోటకు బీటలు పారడం మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మూడో స్థానానికి దిగజారిపోయింది గులాబీ పార్టీ.2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బి ఆర్ ఎస్ కు మొదటి తగిలింది కరీంనగర్ లోక్సభ పరిధిలో ఏడుపు ఏడు సీట్లు నాడు కారు పార్టీ ఖాతాలో ఉన్నప్పటికీ ఆ సమయంలో కూడా ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ఓడిపోయారు అప్పుడు మొదలైన పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నది జిల్లాలో ఐదు సీట్లకు పరిమితం అయింది అంతకుముందు శాసనసభ ఎన్నికల్లో 13 కు గాను 12 గెలిచిన టిఆర్ఎస్ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం 5 సీట్లకు పరిమితమైంది కానీ ఓట్ల శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.
సీట్లు రాకుండా ఓట్లు వచ్చాయి కాబట్టి ఎంపీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని గులాబీ పార్టీ నేతలు భావించారు తీరా తెరమీదికి వచ్చాక గెలుపు కాదు కదా కనీసం పోటీ కూడా ఇవ్వలేక టిఆర్ఎస్ చతికీలపడింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒకటో రెండో ఎంపీ సీట్లు గెలుచుకుంటే గౌరవప్రదంగా ఉంటుందనుకున్నా లీడర్లు క్యాడరుకు దారుణమైన ఫలితాలు నిరాశపరిచాయి. కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడానికి బి ఆర్ ఎస్ త్రుటిలో తప్పించుకుంది కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గులాబి పార్టీకి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ స్థానాల్లో కూడా వినోద్ కుమార్ కు మెజారిటీ రాలేదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా బీజేపీకి ఆధిక్యం వచ్చింది మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిథ్యం వహించిన కరీంనగర్ నియోజకవర్గంలో కనీసం ఓట్లు సాధించలేక బీఆర్ఎస్ మూడో స్థానంకు పడిపోయింది. పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా మూడోస్థానంకు టిఆర్ఎస్ చేరుకుంది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో వరస పరాజయాలు టిఆర్ఎస్కు పెద్ద దెబ్బగా కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించేనా..
ఇప్పటికే చతికిలపడిన బి ఆర్ ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తున్న అనేది ఆ పార్టీ క్యాడర్లో ప్రశ్నగా మారింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం లో బీఆర్ఎస్ మూడో స్థానాన్ని చేరుకోవడమే కాకుండా రాష్ట్రంలో ఒక్క లోక్సభ సీటు కూడా రాకపోవడంతో ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు కొంతమంది చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మాత్రం కొంత టిఆర్ఎస్ కు కష్టంగానే ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనే దానిపై టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎదురుచూస్తుంది.