పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌

A perfect comedy entertainerఏడు చేపల కథ’ ద్వారా పరిచయమైన అభిషేక్‌ పచ్చిపాల హీరోగా, నజియా ఖాన్‌, వినీషా జ్ఞానేశ్వర్‌ హీరోయిన్లుగా రెడ్‌ స్వాన్‌ ఎంటర్టైన్మెంట్‌, కార్తీక్‌ ధర్మపురి సమర్పణలో సుధర్మ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మాతలు తన్వీర్‌, ప్రకాష్‌ ధర్మపురి సంయుక్తంగా యశ్వంత్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘జస్ట్‌ ఎ మినిట్‌’. ఈ సినిమాకి సంబంధించి సుధర్మ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, మూవీ ట్రైలర్‌ను ‘ఘాజి, అంతరిక్షం’ మూవీ డైరెక్టర్‌ సంకల్ప్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కార్తీక్‌ ధర్మపురితో నాకు మంచి అనుబంధం ఉంది. టెక్నికల్‌గా ఎంతో నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి. ఈ సినిమాతో ప్రొడక్షన్‌ వైపు వచ్చారు. అలాగే అభిషేక్‌ రెడ్డి గతంలో చేసిన ‘ఏడు చేపల కథ’ ఒక మంచి మెసేజ్‌ ఉన్న సినిమా. నాకు తెలిసిన ఇద్దరు ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడం మంచి విషయం. ఇదొక మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. మంచి కామెడీ ఆరోగ్యానికి మంచిది. ఈ సినిమా కార్తీక్‌, అభిషేక్‌ రెడ్డికి మంచి సక్సెస్‌ ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఎంతో బిజీగా ఉండి కూడా మా కోసం సమయం కేటాయించి మా సుధర్మ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లోగో, మా మూవీ ట్రైలర్‌ని లాంచ్‌ చేసిన సంకల్ప్‌ రెడ్డికి ప్రత్యేక కతజ్ఞతలు. ఈనెల 19న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకు వస్తున్నాం. ప్రేక్షకులు సినిమా చూసి, మంచి సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాం’ అని నిర్మాతలు తన్వీర్‌, ప్రకాష్‌ ధర్మపురి చెప్పారు. అభిషేక్‌ పచ్చిపాల, ఇషిత సింగ్‌, వినీషా, నజియా ఖాన్‌, జబర్దస్త్‌ ఫణి, సతీష్‌ సారిపల్లి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌ : దుర్గ నరసింహ, సినిమాటోగ్రాఫర్‌ : అమీర్‌, మ్యూజిక్‌ :ఎస్‌.కే.బాజీ, మ్యూజిక్‌ లేబుల్‌ : మధుర ఆడియో.