భారీ సెట్‌లో పక్కా మాస్‌ సాంగ్‌

భారీ సెట్‌లో పక్కా మాస్‌ సాంగ్‌నితిన్‌, బ్యూటీ డాల్‌ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న అవుట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్‌’. రైటర్‌ – డైరెక్టర్‌ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300కి పైగా ఫారిన్‌ డాన్సర్స్‌తో జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో పక్కా మాస్‌ సాంగ్‌ను హీరో నితిన్‌, శ్రీలీలపై చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో ఎంటైర్‌ షూటింగ్‌ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 8న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. నితిన్‌ ఈ చిత్రంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ క్యారెక్టర్‌లో కనిపించి తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేయించనున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌, ఆదిత్యమూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రుచిర ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్స్‌పై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.