గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. దోనేపూడి చక్రపాణి సమర్పించారు. దసరా కానుకగా ఈనెల 11న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
శ్రీనువైట్లతో సినిమా చేయాలని చాలా కాలం కిందట అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత ‘విశ్వం’ కథ లైన్‌గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్‌గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురు తాయనిపించింది. ఇందులో కంప్లీట్‌గా శ్రీనువైట్ల మార్క్‌తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్‌గా ఉన్నాయి.
లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇందులో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్‌కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్‌గా వచ్చాయి. అలాగే శ్రీను వైట్ల ‘వెంకీ’ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఉంది. కాబట్టి డెఫినెట్‌గా ఆయన నుంచి మరో ట్రైన్ ఎపిసోడ్ వస్తుందంటే కంపారిజన్ ఉంటుంది. అయితే అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్‌కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది.
ఈ సినిమాలో యాక్షన్ డిజైన్‌ని రవివర్మ చేశారు. ఒక స్లీక్ యాక్షన్‌గా చేద్దామని అనుకున్నారు. ఇందులో యాక్షన్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. బేసిగ్గా ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. పాపకి ఏడేళ్లు ఉంటాయి. కానీ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పెర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. ఆ పాప కూడా ఈ సినిమాకి చాలా ప్లస్. ఇందులో ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. శ్రీనువైట్ల ఎమోషన్‌ని చాలా అద్భుతంగా తీశారు.
ఇది శ్రీను వైట్ల కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా చెప్పాను. కావ్య థాపర్ ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేసింది. హీరోతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. ఇండియాలో జరుగుతున్న ఒక ఇష్యూని అండర్ కరెంట్‌గా చెబుతూ లాస్ట్‌లో ఏమిటనేది చెప్తాం. అది ఎంటర్‌టైన్మెంట్ వేలోనే ఉంటుంది. చేతన్ భారద్వాజ్ సౌండింగ్ చాలా బావుంది. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజీఎం కూడా అదరగొట్టాడు. ఈ సినిమా ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదు. చూసినంతసేపు నవ్వుతూనే ఉంటారు. థియేటర్‌లో రెండున్నర గంటల పాటు ఆడియన్స్ హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేసే సినిమా ఇది. పర్ఫెక్ట్ పండగ సినిమా. ఫ్యామిలీ అంతా కలసి హాయిగా నవ్వుకోవచ్చు.
ప్రభాస్, నా కాంబినేషన్‌లో సినిమా చేయాలని మాకూ ఉంది. అయితే సరైన కథ కుదరాలి. అలాంటి కథ కుదిరితే తప్పకుండా మా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. యూవీ క్రియేషన్స్‌లోనే నా నెక్ట్స్ మూవీ ఉంటుంది.
– హీరో గోపీచంద్