సంక్రాంతికి సరైన సినిమా

నాగార్జున అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ టీజర్‌ను విడుదల చేశారు. ‘ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ నాగార్జున, అల్లరి నరేష్‌ల స్నేహాన్ని ఎలివేట్‌ చేయగా, సినిమాలోని అన్ని ఇతర లేయర్స్‌ని టీజర్‌ పరిచయం చేసింది. నాగార్జున గురించి ఆషికా రంగనాథ్‌, అల్లరి నరేష్‌ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణతో టీజర్‌ ప్రారంభమవుతుంది. నాగ్‌, ఆషికా యంగ్‌ ఏజ్‌లో వీరిద్దరి ప్రేమ, నాగ్‌ తన స్నేహితులైన అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌లతో స్నేహం చాలా అద్భుతంగా టీజర్‌లో ప్రజెంట్‌ చేశారు. ముఖ్యంగా టీజర్‌ చివరి సగం మాస్‌ స్టఫ్‌, యాక్షన్స్‌ సీక్వెన్స్‌ గూస్‌ బంప్స్‌ తెచ్చింది. అన్ని కోణాలను అద్భుతంగా ప్రజెంట్‌ చేసిన టీజర్‌.. ఇది పర్ఫెక్ట్‌ సంక్రాంతి ట్రీట్‌ని ప్రామిస్‌ చేస్తోంది. ప్రతి సీక్వెన్స్‌ని విజరు బిన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా తీర్చిదిద్దారు. ఈ సినిమా సంక్రాంతికి థియేట్రికల్‌ రిలీజ్‌ అవుతుంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.