నాగార్జున అక్కినేని నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజరు బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈనెల14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు విజరు బిన్ని మీడియాతో ముచ్చటించారు. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా టర్న్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిని కావాలనే పరిశ్రమలోకి వచ్చాను. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా చూసిన తర్వాత అన్నీ క్రాఫ్ట్స్ బాగా చేశారు. కొరియోగ్రాఫర్‌కి ఆ గ్రిప్ ఉంటుందని భావించి కొన్నాళ్ళు కొరియోగ్రఫీ వైపు వెళ్లాను. నా తొలి సినిమానే నాగార్జున లాంటి పెద్ద స్టార్‌ని డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో నాగార్జునకి కొన్ని పాటలు చేశాను. దీంతో సినిమాని కూడా చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్లాం. నాగార్జునతో ఒక సినిమా చేయాలని ఆయనకి కథ చెప్పాను. అప్పుడు ఆయన ఈ కథ గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయమని చెప్పారు. ఆయన చెప్పిన కథని వోన్ చేసుకుని నా స్టయిల్లో చేశాను. ఈ సినిమాలో చాలా హైస్ ఉంటాయి. వింటేజ్ నాగార్జున కనిపిస్తారు. నేను ఆయన్ని ఎంత డిఫరెంట్‌గా చూపించాలని అనుకున్నానో అంత కొత్తగా ప్రజెంట్ చేశానని అనుకుంటున్నాను. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రల గురించి చెప్పాలంటే ఇదొక ఫ్రెండ్షిప్ మూవీ. నరేష్‌కి నాగార్జున గారంటే పిచ్చి. వారిద్దరిని ఈ కథలో పెడితే బావుంటుందనిపించింది. నరేష్ అద్భుతంగా చేశారు, వీరితో పాటు మరో యంగ్ యాక్టర్ ఉండాలి. ఆ పాత్రకు రాజ్ తరుణ్‌ని తీసుకున్నాం. ఇందులో ముగ్గురికి ఒకొక్క కథ ఉంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అవుతాయి?, వాళ్ళ మధ్య జరిగిన సిచ్చ్యువేషన్స్ ఏమిటనేది చాలా కొత్తగా ఉంటుంది. స్నేహం, మంచి ప్రేమకథ, చాలా మంచి ఎమోషన్ ఉంటాయి. 80-90 మధ్య కాలంలో జరిగే కథ ఇది. ఇందులో ఐటెం సాంగ్ సర్ప్రైజ్ మాత్రమే కాదు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. అవన్నీ తెరపై చూడాల్సిందే (నవ్వుతూ). కీరవాణి చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడిలా చూడలేదు. నేను కొరియోగ్రఫర్ని కాబట్టి మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. ఆయనకి ఏదైనా చెప్పినా ఒక సెన్స్‌తోనే చెబుతుంటాడని భావించేవారు. ఇప్పటివరకూ వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. రాబోయే మూడు పాటలు కూడా వైరల్ అవుతాయి. ఇందులో నాలుగు పాటలకు నేను కొరియోగ్రఫీ చేస్తే, ఒక పాట విజరు, మరో పాట దినేష్ మాస్టర్ చేశారు.అలాగే నిర్మాతలు కూడా చాలా సపోర్ట్ చేశారు. కావాల్సిన ప్రతీదీ సమకూర్చారు.