– గ్రామ ప్రజల్లో ఈ భూమి హనుమాన్ దేవస్థానం భూమిగా చెప్పుకుంటున్నారు
– దేవస్థానం భూమి కౌలు వేలం పాట వాయిదా వేయడం కారణాలు ఏమిటి.. ప్రజల్లో టాక్
– దేవస్థానం పేరున పట్టా ఉన్నా కూడా వేలం ఆపడం ఎందుకు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ హనుమాన్ టెంపుల్ పేరున రెండు సర్వే నెంబర్లలో మొత్తం 14 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ భూమి కూడా రెవిన్యూ రికార్డుల్లో హనుమాన్ టెంపుల్ పేరునా ఉంది. ఈ భూమి కూడా హనుమాన్ టెంపుల్ దేవస్థానం దేనని గ్రామస్తులు తెలుపుతున్నారు. పెద్ద మొత్తంలో హనుమాన్ టెంపుల్ పేరునగల భూమి కి కౌలు వేలంపాట వేయడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఈనెల 28న మేనూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఆ గ్రామ పెద్దలు ఎవరు ఈ భూమి హైకోర్టులో కేసు నడుస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. రెవెన్యూ రికార్డులో హనుమాన్ టెంపుల్ పేరున పట్టా భూమిగా ఉన్నప్పటికీ ఎవరో వచ్చారు. ఆ భూమి కోర్టులో కేసు ఉంది. కేసు నడుస్తుండగా మీరు ఆ భూమి ఎలా కౌలు వేలంపాట వేస్తారు అనగానే ఇక్కడ వేలంపాట నిర్వహించడానికి వచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సరైన సమాధానం చెప్పకుండా పై అధికారుల ఆదేశాల అనుసారం అనివార్య కారణాల వలన వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. దేవస్థానం పేరున పట్టా ఉన్నప్పటికీ ఎవరో వచ్చి ఏదో చెప్పగానే కౌలు వేలంపాట వాయిదా వేయడం ఏమిటని చర్చలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మేనూరు గ్రామంలో గల హనుమాన్ టెంపుల్ పేరున పక్కగా పట్టా భూమి ఉన్నప్పటికీ అధికారులు భయంతో వెళ్లిపోయారా అనేది మేనూర్ హనుమాన్ టెంపుల్ దేవస్థానం భూమి పట్ల రకరకాల చర్చలు వినబడుతున్నాయి.
దేవుని పేరున పట్టా ఉన్న భూములకే అధికారులు కౌలు వేలంపాట నిర్వహించడంలో నిర్లక్ష్యం ఏమిటని చర్చ ప్రజల్లో వ్యక్తం అవుతుంది. దేవాలయాల భూములు అన్యక్రాంతం అవుతుంటే ఇటు రెవెన్యూ శాఖ అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవస్థానాల భూముల పట్ల పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మద్నూర్ మండలంలో నీ పలు గ్రామాల్లో దేవస్థానాలకు భూములు ఉన్నాయి. అలాంటి భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి. వాటికోసం ఎవరు పట్టించుకోవాలి. అధికారుల చర్యలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేవాలయాల భూములు పట్టాదారులకు సొంత భూములుగా మార్చుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దేవాలయాల భూములు అన్యక్రాంతం కాకుండా ఉండాలంటే పక్కగా పట్టా భూమిగా మేనూర్ హనుమాన్ టెంపుల్ పేరునగల దానికి వెంటనే దేవాదాయ ధర్మాదాయ శాఖ రెవెన్యూ శాఖల అధికారులు పకడ్బందీ చర్యలతో వెంటనే కౌలు వేలంపాట వెయ్యాలని ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. దేవాలయాల భూములు కాపాడడంలో ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అటు రెవెన్యూ శాఖల అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.