టి హాబ్ లో భిక్కనూర్ విద్యార్థుల ప్రదర్శన

నవతెలంగాణ – భిక్కనూర్
హైదరాబాద్ లోని టీ హబ్ లో జరిగిన స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో భిక్కనూర్ మొదటి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల చోటు దక్కింది. రాష్ట్రంలోని 15 మొదటి అత్యున్నత పాఠశాలల జాబితాలో భిక్కనూర్ జడ్పీఎస్ కు స్థానం లభించడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పాల్గొని హెల్త్ సర్వీస్ యాప్ ను ప్రదర్శించారు. యు ఎన్ ఐ సి ఈ ప్రతినిధులు హాజరై విద్యార్థులు తయారుచేసిన ఆకు గురించి వివరాలు అడిగి తెలుసుకొని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల వెంట సైన్సు ఉపాధ్యాయులు బాలగంగాధర్, సరిత, వెళ్లారు. టీ హబ్ లో హెల్త్ సర్వీస్ యాప్ గురించి ప్రదర్శించిన విద్యార్థులను జిల్లా విద్యాధికారి రాజు, సైన్స్ అధికారి సిద్ధరామిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, అధ్యాపకులు అభినందించారు.