డిఫరెంట్ కంటెంట్ వెబ్ సిరీస్, సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5. ఈ మాధ్యమం నుంచి నూతన వెబ్ సిరీస్ ‘వికటకవి’ ఈనెల 28 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. ‘సర్వం శక్తిమయం’ను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న మొట్ట మొదటి డిటెక్టీవ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. ఈ పీరియాడిక్ సిరీస్ గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి మీడియాతో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. రైటర్ తేజ దేశ్‌రాజ్ రాసుకున్న కథ ఇది. కథ విన్న తర్వాత నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ తరహా పీరియాడిక్ సిరీస్ చేయటం డైరెక్టర్‌గా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఎందుకంటే కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. కథ అంతా 1940, 1970 కాలాల్లో జరుగుతుంది. అలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేసి తెరకెక్కించటం అనేది ఓ కిక్ ఇచ్చింది. ఆ కాలాలకు సంబంధించిన సెటప్స్, బట్టలు, అప్పటి ప్రజలు మాట్లాడే భాష, లుక్స్, లైటింగ్, వర్కింగ్ మూడ్ ఇలా అన్నీ టీమ్‌కి ఛాలెంజ్ విసిరాయి. సిరీస్‌ను కంటెంట్ ప్రకారం ఓ రాయల్ లుక్‌తో చూపిస్తూనే, కథానుగుణంగా మంచి థ్రిల్లర్ ఎలిమెంట్‌తో తెరకెక్కించాను. ఇందులో అమరగిరి సంస్థానం అనే కాన్సెప్ట్ కథలో ఉంటుంది. స్వాతంత్య్రం రాక మునుపు మన దేశంలో చాలా సంస్థానాలుండేవి. అలాంటి వాటిలో తెలంగాణకు చెందిన అమరగిరి ప్రాంతం ఒకటి. రైటర్ తేజ డిఫరెంట్ కథను చెప్పాలనుకున్నప్పుడు తన మైండ్‌లో వచ్చిన ఐడియా ఇది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నారు. కొన్నాళ్లలో ఊరు మునిగిపోతుంది.. అనే బ్యాక్‌డ్రాప్ కథతో ‘వికటకవి’ అనే ఫిక్షనల్ పాయింట్‌ను తీసుకున్నారు. వికటకవి సీజన్ 2 కూడా ఉంటుంది.