
నవతెలంగాణ – కోహెడ
మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో శాశ్వత అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించాలంటూ శుక్రవారం తహాశీల్దార్ సురేఖకు గ్రామస్థుల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి అంగన్‌వాడీ గ్రామానికి దూరంగా ఉందని దీంతో చిన్నారులు, చిన్నారుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే ఉన్న స్థలంలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణాన్ని చేపట్టాలని తహాశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కోన్నారు. సంబంధిత అధికారులకు పంపిస్తామని తహాశీల్దార్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు చిట్యాల అశోక్, పద్మయ్య, మల్లేష్, తిరుపతి, రమేష్, మనోజ్, బొంబాయి రాజవ్వ, లింగవ్వ, రాజవ్వ, శివాణి, కావ్య, పద్మ, రుక్మిణీ, బుచ్చవ్వ, లక్ష్మి, మహాంకాళి చిన్నలక్ష్మి, సమ్మవ్వ, రేణుక, సుజాత, శిరీష, మంద రాధిక, తదితరులు పాల్గొన్నారు.