– నూతన చట్టాలు,షీ టీం విధులపై విద్యార్థులకు అవగాహన
నవతెలంగాణ – బెజ్జంకి
బంగారు భవిష్యత్తుకు చదువే శాశ్వతమని..చెడు వ్యసనాలు జీవితానికి బానిసత్వమని..క్రమశిక్షణ శిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయి అవకాశాలను మేరుగుపర్చుకోవాలని ఎస్ఐ క్రిష్ణారెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులకు ఎస్ఐ క్రిష్ణారెడ్డి మహిళల రక్షణ చట్టాల, షీటీం విధులు, షీటీంతో పొందే రక్షణ, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాలు, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ప్రభావం, సైబర్ నేరాలు, మహిళల భద్రతకు పోలీసులు తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ చాలా కీలకమని..కష్టపడే తత్వం అలవర్చుకుని చదువుపై దృష్టి సారించాలని ఎస్ఐ క్రిష్ణారెడ్డి ప్రత్యేకంగా సూచించారు. ఏఎస్ఐ శంకర్ రావు,సిద్దిపేట షీటీం బృందం కిషన్, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు మమత, వీణకుమారి, కానిస్టేబుళ్లు ప్రవీణ్, లక్ష్మీనారాయణ, విద్యాలయ బోధన సిబ్బంది పాల్గొన్నారు.