
నవీపేట మండలం పోతంగల్ గ్రామానికి చెందిన ర్యాపన్ శంకర్ వయసు 58 సంవత్సరాలు కుటుంబంతో సహా గత ఎనిమినెల క్రితం ఎల్లమ్మ గుట్ట అమ్మ వెంచర్ నందు వాచ్మెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతను గతంలో ఇతని కూతురు పెళ్లి గురించి, అదేవిధంగా ఊరిలో ఇల్లు కట్టడం కొరకు అప్పులు చేయడం జరిగింది. ఇట్టి బాకీలు తీర్చుకోలేనని మనోవేదన చెందుతూ గత రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగినాడు ఆసుపత్రి లో చికిత్స పొందుతు శుక్రవారం చనిపోయాడు. ఈ విషయంలో మృతుని భార్య నర్సుబాయి పిర్యాదు పై కెసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.