
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పెద్దమల్లరెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మల్లయ్య (53) ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఈనెల 17వ తేదీ నాడు వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మల్లయ్య ను కామారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసుల తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.