ప్రమాదవ శాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన కుభీర్ మండలంలోని సౌంలి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీస్ లు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తనూర్ మండలంలోని ఎల్వత్ గ్రామానికి చెందిన అవధుత్ రాజారత్న (22) అనే యువకుడు కుబీర్ మండలంలోని సౌంలి గ్రామంలో రాజారత్న అనే యువకుడు పెద్దమ్మ ఇంటికి 4రోజుల కిందటగా సొంలి కి వచ్చారు. దింతో గురువారం సాయంత్రం సమయంలో వరుసకు అన్నయ్య సందీప్ తో కలసి వ్యవసాయా క్షేత్రంలోకి వెళ్లి సొలర్ పెన్సింగ్ కొరకు కట్టెలు తీసుకురావడానికి వెళ్లారు. కట్టెలు జామచేసిన తర్వాత సౌంలి చెరువులోకి స్థానానికి దిగి ప్రమాదవ శాత్తు లోపలికి పడిపోయాడు. దింతో పక్కన ఉన్న సందీప్ గమనించి చుట్టూ పక్కలా ప్రజలకు పిలవగానే చేరువులో వెతకగా రాజారత్న ఆచూకీ లభించకపోవడంటో శుక్రవారం గ్రామస్తులు చెరువులో వెతికారు. రాజారత్న మృతదేహం కనిపించడం జరిగింది. దింతో మృతుడి తండ్రి గంగాధర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ రవీందర్ తెలిపారు.