కొలనూరులో బావిలో పడి వ్యక్తి మృతి..

రాజన్న సిరిసిల్ల: నవతెలంగాణ కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో బావిలో పడి శ్రీరాముల రాజేశం (55) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న కోనరావుపేట ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.