ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

నవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు .ఈ ఘటన దుబ్బాక మండల పరిధిలోని అప్పనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.శుక్రవారం దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం రావురూకుల గ్రామానికి చెందిన కనకయ్య (50) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దుబ్బాకకు తన వ్యక్తిగత పని నిమిత్తం వెళ్లి పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో అప్పనపల్లి గ్రామం వద్ద ప్రమాదానికి గురయ్యాడనీ, తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు సిద్దిపేటకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందారని తెలిపారు. మృతుని కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.