వాహనం అదుపుతప్పి వ్యక్తి  మృతి..

నవతెలంగాణ – బెజ్జంకి
వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని గుండారం గ్రామ శివారులో అదివారం చోటుచేసుకుంది.పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన రణం లింగయ్య(41) సెంట్రీంగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ నెల 24న బెజ్జంకిలో కూలీ పని చేసుకుని ద్విచక్ర వాహనంపై తన ఇంటికి తిరుగు ప్రయాణంలో గుండారం గ్రామ శివారులో వాహనం అదుపుతప్పి పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి.హైదాదాబాద్ గాంధీ ఆస్పత్రి యందు చికిత్స పొందుతూ బాధితుడు లింగయ్య మృతిచెందాడని పోలీసులు తెలిపారు.మృతుని భార్య విజయ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు. మృతునికి కుమారుడు,కూతురు సంతానం.