వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి 

నవతెలంగాణ – రాయపర్తి
ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కన గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎస్సై సందీప్ కథనం మేరకు మండలంలోని తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన బండి సాయిలు (46) గత సోమవారం పాలకుర్తి మండలం అవుతాపురం గ్రామంలో చుట్టాల వ్యక్తి చనిపోగా దహన సంస్కారాల కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణమై స్వగ్రామానికి వెళ్తుండగా పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులో మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోగా తీవ్ర గాయాలైన సాయిలు మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతుడి కుమారుడు బండి హరీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.