నవతెలంగాణ – ఆర్మూర్
జాతీయ రహదారి 44 పైన సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై గంగాధర్ సోమవారం తెలిపారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న షేక్ కరీం (58) సంవత్సరాలు అనే వ్యక్తిని, వెనక నుండి వస్తున్న కారు ఢీకొనడంతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.