నవతెలంగాణ-కేశంపేట
ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తలకొండపల్లి మండలంలోని జూలపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిడ్జిల్ గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని బ్రహ్మచారి(57) కుటుంబ సభ్యులతో చెప్పి కాకునూరులోని తన స్వగృహం నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు పల్సర్ బైక్ పై బయలుదేరాడు. బంధువులను కలిసి తిరిగి వస్తుండగా తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామ శివారులో రహదారిపై పల్సర్ బైక్ అదుపుతప్పి కిందపడంతో ఆయనకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కాకునూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సోమవారం సొంత గ్రామంలో బ్రహ్మచారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల, బంధువుల రోధనలు చూసి, బ్రహ్మచారి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.