రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నవతెలంగాణ-యాచారం
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన యాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆది వారం జరిగింది. సీఐ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం మాడుగుల మండలం, నరసాయిపల్లికి చెందిన తోలు కృష్ణయ్య తండ్రి రాములు (28) వృత్తిరీత్యా మేస్త్రి పని చేస్తున్నాడు. ఆదివారం 9 గంటల సమయంలో యాచారం ప్రభుత్వ ఆస్పత్రికి ద్విచక్ర వాహనంపై తన గ్రామం నుంచి వెళ్లుతున్నాడు. అయితే బైక్‌ అదుపు తప్పి తమ్మలోని గూడ గేటు దగ్గర రోడ్డు పక్కన ఉన్న సిమెంట్‌ దిమ్మెకు ఢకొీన్నడంతో తలకు తీవ్రంగా గాయాలపై అక్కడిక్కడే మృతి చెందాడు.సమాచారం తెలుసుకున పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదయ్య తెలిపారు.